President Message (2022 - 2024)
 

ప్రియమైన FTAA కుటుంబానికి మరియు ఆస్ట్రేలియాలోని తెలుగువారందరికీ నమస్కారములు. ఆస్ట్రేలియాలో సుమారు అన్ని తెలుగు సామాజిక సమూహాలకు ప్రాతినిధ్యం వహించేలా, అన్ని సభ్యసంఘాలకు ఏకీకృత ఉమ్మడి సంస్థను అందించడానికి మరియు తెలుగు సంఘాల అభివృద్ధిని ప్రోత్సహించడానికి, తెలుగు భాష, సంసృతి సంప్రదాయలు, సమాజం మరియు కామన్వెల్త్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు లేదా భారత ప్రభుత్వం మధ్య సంక్షేమం, సామాజిక మరియు ఆర్థిక విషయాలపై ఆచరణాత్మక మరియు సమర్థనీయమైన కమ్యూనికేషన్ ఛానెల్‌గా పనిచేయడానికి 2016 లో ఏర్పాటు చేసుకున్న మన FTAA కు (2022-2024) నాయకత్వం వహించడానికి నాపై విశ్వాసంతో అధ్యక్ష భాద్యతలు అందించిన ప్రతి ఒక్కరికి నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. FTAA స్థాపన నుండి వివిధ కార్యావర్గాలలో పనిచేసిన నాకున్న అనుభవంతో మరియు మా కార్యవర్గంలో ఉన్న వారందరి అనుభవాలతో FTAA ను మీరు ఆశించిన స్థాయిలో చూపించగలమనే నమ్మకం వుంది.

మాకొత్త కార్యవర్గంలో కూడా ఎంతో అనుభవంగల తెలుగు సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, సాంకేతిక నిపుణులు మరియు కార్యదక్షత గలవారు ఉన్నారు. మన FTAA లక్ష్యాల సాధనకోసం, "FTAA" ను ఒక గొప్ప వేదికగా చేసుకుని ఈరెండేళ్ళలో ఎన్నో వినూత్న కార్యక్రమలకు శ్రీకారం చుట్టబోతున్నాము. వీటితోబాటు మన సభ్యసంఘాల కృషి, మద్దతులతో తెలుగు భాష, సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకోసం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలనుండి ఉత్తర్వుల సాధనే ధ్యేయంగా కృషి చేసే దిశగా ముందుకి నడుస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాము.

మన FTAA ఇంతవరకు సాధించిన విజయాలు..

  • తెలుగు భాష కు NAATI గుర్తింపు
  • దేశావ్యాప్తంగా తెలుగు వారికి Interpretor & translator అవకాశాలు
  • Census లో తెలుగు వారి నమోదుకార్యకమంలో FTAA చురుకైన పాత్ర పోషించలడం వలన తెలుగు వారి సంఖ్య అధికారికంగా 60,000కి గణనీయంగా పెరగడం
  • శ్రీపొట్టిశ్రీరాములు యూనివర్సిటీ వారు మన curriculum పరిశీలన.
  • కరోనా కాలంలో మన తెలుగు భాషకు, మన interpretors & translators కు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలనుండి మంచి గుర్తింపు.

ఇప్పటి వరకు FTAA కొరకు కృషిచేసిన అధ్యక్షులు మరియు వారి కార్యవర్గ సభ్యులకు వారు చేసిన కృషికి ధన్యవాదములు.

మన సంఘటిత శక్తి అయిన FTAA ద్వారా మాప్రస్తుత కార్యవర్గం యొక్క ప్రణాళిక..

(ఈ పోటీలలో న్యూజీలాండ్ తెలుగువారు కూడా పాల్గొనడానికి ముందుకురావడం విశేషం)

మన సభ్యుల అంగీకారంతో ANZ Federation Cup గా నిర్వహించే అవకాశం.

  • అక్టోబర్ లో ANZ Telugu Cultural Fest 2023 నిర్వహణ.
  • సెప్టెంబర్ లో అంతరాష్ట్ర క్రికెట్ పోటీలు 2023 నిర్వహణ.
  • FTAA అంతరాష్ట్ర పాటల పోటీలు నిర్వహించమని కొంతమంది సభ్యుల కోరిక. మెజారిటీ సభ్యులు ఆమోదిస్తే, నిర్వహణ దిశగా ఆలోచన..
  • తెలుగు మాట్లాడే ప్రతిఒక్కరిని రాబోయే సార్వత్రిక గణాంకాల (Census) సేకరణలో పాల్గొనేలా కృషి చేసి, అత్యధిక నమోదే ధ్యేయంగా.. ప్రతిఒక్కరు పదిమందితో నమోదు చేయించే కార్యక్రమం.. Census వల్ల మన తెలుగువారికి, తెలుగుభాషకు, భావితరాలకు కలిగే ఉపయోగాలు.. ప్రచార కార్యక్రమం..
  • ఆస్ట్రేలియాలో మనకున్న తెలుగు బడులు అన్నిటికి ఒక ఆమోదిత పాఠ్యాంసం ద్వారా, శ్రీ పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయం వారితో తుది పరీక్షల నిర్వహణ మరియు గుర్తింపు పత్రాల ప్రధానం.
  • మన సభ్య సంఘాలు జరుపుకునే కార్యక్రమాలకు అంతర్జాతీయ కళాకారుల సమన్వయ భాద్యత తీసుకోవడం
  • దేశావ్యాప్తంగా మన తెలుగు వారికి ఎటువంటి ఆపద వచ్చినా FTÀA కీలకపాత్రపోషించి అన్ని రాష్ట్రాల సభ్య సంఘాల సహకారాన్ని కూడగట్టి వీలైనంత ఎక్కువ సహాయం చేయడం.

ఈ మధ్యనే 31/03/23 న జరిగిన మా కార్యవర్గ సమావేశంలో FTAA అభివృద్ధి, అది చేపట్టిన కార్యక్రమాల సాధన ద్యేయంగా పూర్వ అధ్యక్షులు, తెలుగు కమ్యూనిటీకి ఎనలేనిసేవచేసిన వారిని మన FTAA Advisory committee లో నియమించుకున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను..

వారు :

  • శ్రీ కృష్ణ నడింపల్లి.. కాన్బెరా
  • శ్రీ సతీష్ బాబు వరదరాజులు.. సిడ్నీ
  • శ్రీ పురుషోత్తం నాయుడు.. బ్రిస్బేన్

వీరి విలువైన సలహాలు సూచనలతో మాకార్యవర్గం చేపట్టిన కార్యక్రమాల సాధన దిశగా మరింత ఉత్సాహంతో పయనించగలమని ఆశిస్తున్నాను.

FTAA ఆస్ట్రేలియా వ్యాప్తంగా చేపట్టే కార్యక్రమాల ద్వారా, రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలకు మనఉనికిని చాటిచెప్పి, కమ్యూనిటీ అభివృద్ధికి మనంచేసే కృషిని గుర్తెరిగేలా చేస్తే మనకు, మన తెలుగుజాతికి అవసరమైన అన్ని సహకారాలు ప్రభుత్వాలనుండి పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  ప్రభుత్వాలు మనకు సహకారం అందించే దిశగా చేసుకోవడం పెద్ద కష్టతరమేమికాదు. వీటి సాధనలో, FTAA చేసే ప్రతీకార్యక్రమంలో మన సభ్య సంఘాలు మేమున్నాము మీరు ముందుకు నడవండి అని మద్దతు పలుకుతూ, వారి సంఘ సభ్యులను కార్యక్రమాలలో విరివిగా పాల్గొనేలా మరియు వారిని చైతన్యం చేయడం ద్వారా మా ఈ కార్యవర్గంకు చేయూతనిచ్చి మమ్ములను ముందుకు నడిపిస్తారని భావిస్తూ..

మీ
సత్యనారాయణ శీలం @ సత్య శీలం

President
Federation of Telugu Associations in Australia

 

Member Associations

© 2025 Federation of Telugu Associations Australia Inc. All rights reserved.

Design & Developed by Arjunweb Solutions

Menu